గుడుంబా నిర్మూలనపై పోలీసుల ఫోకస్​

గుడుంబా నిర్మూలనపై పోలీసుల ఫోకస్​
  •     జిల్లాలో మెరుపు దాడులు 
  •      గుడుంబా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమంటున్న ఎస్పీ

మహబూబాబాద్​, వెలుగు : జిల్లాలో గుడుంబా నిర్మూలించేందుకు పోలీసులు దృష్టి సారించారు. ఎస్పీ సుధీర్​ రామ్​ నాధ్​​​ కేకన్​ ఆధ్వర్యంలో పోలీసులు యాక్షన్​ ప్లాన్​  అమలు చేస్తున్నారు. వారంలో ఒక రోజు గుడుంబా కేంద్రాలే లక్ష్యంగా దాడులను నిర్వహిస్తూ .. వేల లీటర్ల బెల్లం పానకాన్ని,  గుడుంబాను ధ్వంసం చేస్తున్నారు. ఒక్క రోజులోనే 8870 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. మహబూబాబాద్​ జిల్లాలో ఈ నెల11న పోలీసులు 326 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని

69 కేజీల నల్ల బెల్లం, 8870 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసి 31 మంది పై కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా182 మంది పోలీస్​ ఆఫీసర్లు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.  ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జిల్లాలో 618 నాటు సారాయి కేసులు నమోదు చేసి, 21,269 లీటర్ల గుడుండా  స్వాధీనం చేసుకున్నారు.  59,629 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.

గుడుంబా రహిత జిల్లాగా మార్చడం కోసం చర్యలు

మహబూబాబాద్ జిల్లా లో గుడుంబా స్థావరాలపై దృష్టి పెట్టాం. గుడుంబా తయారీ చేస్తే కేసులు నమోదు చేస్తున్నాం గ్రామస్థుల్లో గుడుంబా వల్ల జరిగే నష్టాలను అవగాహన కల్పిస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తున్నట్టు తెలిసి  వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలి. ప్రజలు గుడుంబా నిర్మూలనకు సహకరించాలి. జిల్లాకు నల్ల బెల్లం సరఫరా కాకుండా నిఘా  పెంచుతున్నాం. 

- సుధీర్​ రామ్​నాధ్​ కేకన్​,ఎస్పీ , మహబూబాబాద్​జిల్లా