జగిత్యాలలో ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ దందాపై పోలీసుల నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జగిత్యాలలో ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ దందాపై పోలీసుల నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • జగిత్యాల జిల్లాలో ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులపై దాడులు 
  • భారీగా ప్రామిసరీ నోట్లు, నగదు, చెక్కుల స్వాధీనం 
  • సామాన్యుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న ఫైనాన్షియర్లు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో పేద, మధ్యతరగతి కుటుంబాల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు. కొంతకాలంగా జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, కోరుట్ల, రాయికల్​పట్టణాల్లో అధిక వడ్డీల దందా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు ఎలాంటి పర్మిషన్లు లేకుండానే అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడంతోపాటు  రిజిస్ట్రేషన్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తూ సంపాదిస్తున్నారు.  గుట్టుగా సాగుతున్న ఈ దందాలో సామాన్యులు అధిక వడ్డీల బారినపడుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈక్రమంలో పోలీసులు అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. జిల్లాలోని పలువురు వడ్డీ వ్యాపారుల ఇండ్లపై ఏకకాలంలో దాడులు చేసి భారీ ఎత్తున నగదు, ప్రామిసరీ నోట్లు, బాధితుల నుంచి తీసుకున్న చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
 
రూల్స్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం 

జగిత్యాల జిల్లాలో రూల్స్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా వడ్డీ , చిట్టీల నిర్వహణ, బంగారు నగలు కుదువపెట్టుకొని డబ్బులు ఇవ్వడం.. వంటి బిజినెస్‌‌‌‌‌‌‌‌ జోరుగా సాగుతోంది. ఎవరైనా చిట్టీలు నిర్వహించాలంటే చిట్‌‌‌‌‌‌‌‌ఫండ్స్‌‌‌‌‌‌‌‌ యాక్ట్ 1982 ప్రకారం జిల్లా చిట్స్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫైనాన్స్( వడ్డీ) నిర్వాహుకులు కూడా సంబంధిత శాఖ నుంచి లైసెన్స్‌‌‌‌‌‌‌‌ పొంది ఆర్బీఐ రూల్స్‌‌‌‌‌‌‌‌ సూచించిన వడ్డీ రేట్లకే అప్పులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే లావాదేవీలకు సంబంధించిన రికార్డులు మెయింటేయిన్‌‌‌‌‌‌‌‌ చేస్తూ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్యాక్స్​ కట్టాల్సి ఉంటుంది.  మరికొందరు పర్మిషన్లు తీసుకున్నప్పటికీ రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించడంలేదు. ఈ దందాలో బడా వ్యాపారులు 5 నుంచి 10 శాతం వడ్డీకి అప్పులు ఇస్తూ దందా చేస్తున్నారు. మరోవైపు చిట్టీల పేరుతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు దందాలు 
చేస్తున్నారు. 

ఆస్తులు కుదువపెట్టుకొని అప్పులు

అక్రమ వ్యాపారం చేస్తున్న కొందరు అధిక వడ్డీలకు కక్కుర్తి పడి అందిన కాడికి గుంజుతున్నారు. పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ల స్థిరాస్తులపై కన్నెస్తున్నారు. ష్యూరిటీగా ఆస్తులు కుదవ పెడితే అప్పు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు. మరికొందరు అయితే ఏకంగా సేల్ డీడ్ చేయించు కుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా వ్యాపారం చేసేవారు లీగల్‌‌‌‌‌‌‌‌గా చట్టం నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. దానికి తోడు పర్మిషన్ తీసుకొని వ్యాపారం చేస్తే వచ్చే వడ్డీ కంటే ఇల్లీగల్ గా దందా చేస్తే ఎక్కువ మొత్తంలో రావడంతో అనుమతి లేకుండా చిట్స్, ఫైనాన్స్ నిర్వహిస్తున్నారు. 

దాడులపై సమాచారం లీక్.. 

వడ్డీ వ్యాపారం చేసే వారి ఇళ్లపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. అయితే ఈ దాడులకు సంబంధించి కొందరు బడా వ్యాపారులకు ముందస్తుగా సమాచారం లీక్‌‌‌‌‌‌‌‌ అవడంతో వారంతా సర్దుకున్నారన్న ఆరోపణలున్నాయి. వారిపై దాడులు కూడా జరగకపోవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఏకంగా ఎస్పీ నుంచి ఆదేశాలున్నా  పోలీస్‌‌‌‌‌‌‌‌ శాఖలోని కొందరు.. అక్రమార్కులకు సమాచారం ఇచ్చారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. 

పోలీసుల దాడుల్లో భారీగా నగదు, ప్రామిసరీ నోట్లు 

జగిత్యాల జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేసి రూ.30, 82, 020 లక్షల నగదు, రూ. 4,45, 21, 800 విలువైన 619 ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, రూ.1,53,62,435 విలువైన 32 చెక్కులు, రూ. 2.50 లక్షల విలువైన మార్టిగేజ్ డీడ్, సుమారు కిలోన్నర వరకు బంగారం పట్టుకున్నారు. జగిత్యాల టౌన్ లో ఐదుగురి వద్ద నుంచి రూ.5 లక్షల 63 వేల నగదు, 84 ప్రామిసరీ నోట్లు, రూ.2.50 లక్షల మార్టిగేజ్ డీడ్, జగిత్యాల రూరల్‌‌‌‌‌‌‌‌లో ఒకరి వద్ద రూ. 1. 19 లక్షల నగదు,  రూ.23,83,500 విలువైన 62 ప్రామిసరీ నోట్లు, రాయికల్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురి వద్ద ఉన్న 28 ప్రామిసరీ  నోట్లు, ధర్మపురిలో 9 మంది నుంచి రూ.2,45,750,25 బాండ్ పేపర్లు, 41ప్రామిసరీ నోట్లు, బుగ్గారంలో ఒకరి నుంచి రూ. 50 వేల విలువైన ప్రామిసరీ నోటు, గొల్లపల్లిలో ఒకరి వద్ద రూ.1,33 లక్షల నగదు, 32 ప్రామిసరీ నోట్లు, కోరుట్లలో ఒకరి వద్ద రూ.1,28 లక్షల నగదు, 321 ప్రామిసరీ  నోట్లు, మెట్‌‌‌‌‌‌‌‌పల్లి లో ముగ్గురి వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, 32 ప్రామిసరీ నోట్లు, 8 చెక్కులు, ఇబ్రహీంపట్నంలో ఇద్దరి నుంచి రూ.10,02,370 లక్షల నగదు, 35 ప్రామిసరీ నోట్లు  స్వాధీనం చేసుకున్నారు.