కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు దృష్టి సారించారు. నగరంలోని బార్ లు ... పబ్ లను తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్ పోలీసులు.. నార్కోటిక్,ఎక్సైజ్,ఎస్ఓటి అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. మైనర్ లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పబ్ యజమానులకు పోలీసులు సూచించారు.
కొత్త సంవత్సరం వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మాదాపూర్ పీఎస్ పరిధిలోని పలు హోటల్స్.. పబ్ లు.. రెస్టారెంట్లను తనిఖీ చేశారు. పర్మిషన్ డాక్యుమెంట్స్ పరిశీలించారు. సౌండ్ పొల్యూషన్ పాటు.... సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలను పబ్ యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, డ్రగ్స్.. మత్తు పదార్ధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.