ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

సత్తుపల్లి, వెలుగు: సింగరేణి బ్లాస్టింగ్ లతో దెబ్బతిన్న కాలనీవాసులకు న్యాయం చేయాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దీక్షతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పందించి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారన్నారు. సింగరేణి నిధుల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. నష్ట పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వకపోతే సెప్టెంబర్ 5 నుంచి నిరుపేదలకు గుడిసెలు వేసే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. నున్న రామకృష్ణ, రావి నాగేశ్వరరావు, గాదె చెన్నకేశవరావు, మానుకోట ప్రసాద్, ఐ కృష్ణ, ఫసల్ బాబా, సమద్, మందపాటి శ్రీనివాసరెడ్డి, భుక్యా శివకుమార్, మహేంద్ర పాషా, ధనలక్ష్మి, కుమారి, సలీం, నాగేంద్రచారి పాల్గొన్నారు.

రాజకీయ స్వార్థం కోసమే..

కోటూరి మానవతారాయ్ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని లైబ్రరీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఏర్పడినప్పటి నుంచి బ్లాస్టింగ్ లు జరుగుతున్నాయని అన్నారు. ప్రభావిత ప్రాంత ప్రజలకు పరిహారం ఇప్పించేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారని, సింగరేణి ఆఫీసర్లను కలిశారని చెప్పారు. ఇన్నేళ్లుగా మానవతారాయ్ కి ఈ ప్రాంత ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్  కౌన్సిలర్లు చాంద్ పాషా, అనిల్, రఘు, ప్రవీణ్, నాయకులు అంకమరాజు, గఫార్ పాల్గొన్నారు.

పోస్టల్​ సేవలు వినియోగించుకోవాలి

వైరా, వెలుగు: పోస్టల్​ సేవలను వినియోగించుకోవాలని ఎంపీపీ వేల్పుల పావని, పోస్టల్​ సూపరింటెండెంట్​జి రవికుమార్  కోరారు. మండలంలోని వల్లాపురం గ్రామంలో బ్రాంచ్​  పోస్ట్ ​ఆఫీస్​ను ​ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవింగ్స్  ఖాతాలు తెరుచుకోవాలని సూచించారు. మధిర సబ్  డివిజన్  పోస్టల్​ ఇన్​స్పెక్టర్ బాజీబాబా, సర్పంచ్ శారమ్మ, ఉప సర్పంచ్ ఏమూరి కల్యాణి, వేల్పుల మురళి, తుమ్మల సత్యం, తుమ్మల రాణాప్రతాప్, బాజోజి రమణ పాల్గొన్నారు.

రేషన్​ బియ్యం పట్టివేత

భద్రాచలం,వెలుగు: భద్రాచలం పట్టణ శివారులోని రాజుపేట కాలనీ వద్ద శుక్రవారం ఉదయం ఆటోలో రేషన్​ బియ్యం తరలిస్తుండగా ఎన్​ఫోర్స్ మెంట్  టీమ్ పట్టుకుంది. దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వైపు ఆటోలో తరలిస్తున్న 9.80 క్వింటాళ్ల బియ్యాన్ని ఎన్​ఫోర్స్ మెంట్ డీటీ వెంకటేశ్వరరావు పట్టుకున్నారు. ఆటోతో పాటు బియ్యాన్ని సీజ్​ చేసి టౌన్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

అన్నపురెడ్డిపల్లిలో.. 

అన్నపురెడ్డిపల్లి: మండలకేంద్రంలో శుక్రవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ను ఎస్సై విజయ పట్టుకున్నారు. ట్రాక్టర్ ను తహసీల్దార్​ భద్రకాళికి అప్పగించగా, ట్రాక్టర్​ యజమాని రాందాస్ కు రూ.5 వేలు ఫైన్ వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భర్తపై కొడుకుతో కలిసి దాడి

సత్తుపల్లి, వెలుగు: వేధింపులకు పాల్పడుతున్న భర్తపై కొడుకుతో కలిసి భార్య దాడి చేసింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని బుగ్గపాడు గ్రామానికి చెందిన జెర్రి కృష్ణ, లక్ష్మి దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగగా, కృష్ణను భార్య లక్ష్మి బలంగా పట్టుకోగా కొడుకు సూర్య కత్తిపీటతో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఉన్న కృష్ణను కుటుంబసభ్యులు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 47.70 అడుగులకు నీటిమట్టం పడిపోవడంతో రెండో ప్రమాదహెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం 11,28,400 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మళ్లీ గోదావరితీర ప్రాంత గ్రామాల్లో భయం పుట్టిస్తోంది. భారీ వర్ష సూచన ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు.

జిల్లా ఆసుపత్రిలో అపరిశుభ్రతపై కలెక్టర్​ ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా ఆసుపత్రిలో అపరిశుభ్రతపై కలెక్టర్​ అనుదీప్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోగులకు కలెక్టర్​ పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. హాస్పిటల్​ను పరిశీలించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై శానిటరీ ఇన్​స్పెక్టర్​పై మండిపడ్డారు. చూసి చెప్తే తప్ప చేయరా.. జీతాలు తీసుకుంటున్నారు కదా.. అంటూ ఫైర్​ అయ్యారు. రోగులకు సెలైన్​ బాటిల్స్​ పెట్టే స్టాండ్స్​ సరిగా లేకపోవడంతో వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ కుమారస్వామి, డీఎంహెచ్​వో దయానంద్, హాస్పిటల్స్​ కోఆర్డినేటర్​ డాక్టర్​ ముక్కంటేశ్వరరావు పాల్గొన్నారు. 

మెరుగైన వైద్యసేవలందించాలి

ఖమ్మం కార్పొరేషన్: పేదలకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ సూచించారు. జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. మాతా శిశు సంరక్షణా కేంద్రంలోని ఓపీ, స్కానింగ్, ఏఎన్​సీ వార్డులను పరిశీలించి ప్రసూతి వార్డులోని బాలింతలకు మిఠాయిలు స్వీట్లు అందించారు. రోగులు, సహాయకులకు, గర్భిణులు, బాలింతలకు భోజనాన్ని వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. మేయర్​ పునుకొల్లు నీరజ, ఆసుపత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ బి వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్​ బొల్లికొండ శ్రీనివాసరావు ఉన్నారు. అనంతరం జిల్లా జైలును సందర్శించి ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంచి పెట్టారు. 

అనాథ, వృద్ధాశ్రమాల్లో స్వీట్లు పంపిణీ

భద్రాచలం: పట్టణంలోని అనాథ, వృద్ధాశ్రమాల్లో శుక్రవారం అడిషనల్  కలెక్టర్​ వెంకటేశ్వర్లు ఉమెన్స్ అండ్​ చైల్డ్  వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మానవసేవ(సరోజిని) వృద్ధాశ్రమం, బ్రెష్​ స్పెషల్​ స్కూల్, కహాల్​ సీసీఐ, వికాసం ప్రత్యేక బాలబాలికల స్కూల్, ఎస్ఏఏ చిల్డ్రన్​ హోమ్​లో స్వీట్లు, ఫ్రూట్స్ పంచారు. సీడీపీవో నవ్యశ్రీ, స్పెషల్​ ఆఫీసర్​ నాగలక్ష్మి, డీడబ్ల్యూవో స్టాఫ్​ సెక్షన్​ ఇన్ చార్జి వరప్రసాద్, సూపర్​వైజర్లు సహానా సుల్తాన్, ధనలక్ష్మీ, సావిత్రి, మాణిక్యం పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

ఇల్లందు, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలనే డిమాండ్​తో శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు. ఈ సందర్బంగా రాష్ట్ర జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, ఎర్రగాని కృష్ణయ్య, ఎండీ రాసుద్దీన్, షేక్ యాకుబ్ షావలి మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల శ్రమతోనే లాభాలు వస్తున్నా వేతనాలను పెంచడం లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే  హరిప్రియనాయక్​కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ నాయకులు బంధం నాగయ్య, ఎస్ఏ నబి, మల్లికార్జున్, ఎల్  రవి, దేవరకొండ శంకర్, పాయం వెంకన్న, రాంసింగ్, శంషోద్దీన్ పాల్గొన్నారు.

ఆయిల్​పామ్ ​ఫ్యాక్టరీ కెపాసిటీ పెంచాలి

అశ్వారావుపేట, వెలుగు: రాష్ట్రంలో ఆయిల్ పామ్​ విస్తీర్ణంపై పెట్టిన శ్రద్ధ ఫ్యాక్టరీల కెపాసిటీపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఆయిల్ పామ్​ గెలల దిగుమతి కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు కొక్కెరపాటి పుల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అశ్వారావుపేట ఆయిల్ పామ్​ఫ్యాక్టరీ వద్ద రాష్ట్రీయ రహదారిపై ఆయిల్ పామ్​ గెలలతో ట్రాక్టర్లు బారులు తీరి ఉండడాన్ని గమనించిన ఆయన రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట ఫ్యాక్టరీ ప్రస్తుతం గంటకు 30 టన్నుల కెపాసిటీతో పని చేస్తుందని దీనిని 60 టన్నుల కెపాసిటీకి పెంచాలని డిమాండ్ చేశారు. రోజుల తరబడి ఫ్యాక్టరీ దగ్గర ట్రాక్టర్లు నిలిచిపోవడంతో గెలలు కుళ్లిపోయి ఆయిల్ రికవరీ శాతం పడిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలలు ఖరాబ్ కాకుండా ఏసీ గిడ్డంగులు నిర్మించాలని కోరారు. 

తండ్రి అంత్యక్రియలు చేసిన కూతురు 

అశ్వారావుపేట, వెలుగు: మండలంలోని నారంవారిగూడెం గ్రామంలో శుక్రవారం దానపు లక్ష్మయ్య(48) అనారోగ్యంతో చనిపోయాడు. ఆయనకు  ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు. కొడుకైనా, కూతురైనా నువ్వే అంటూ తండ్రి చిన్నతనం నుంచి పెద్దకూతురైన కీర్తనను పెంచాడు. తనకు తల కొరివి కూడా నువ్వే పెట్టాలని కూతురుతో చెప్పేవాడు. శుక్రవారం లక్ష్మయ్య చనిపోయాడు. లక్ష్మయ్య పెద్ద కుమార్తె కీర్తన తండ్రి కోరిక మేరకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేసింది. 

రేషన్​ బియ్యం పట్టివేత

భద్రాచలం,వెలుగు: భద్రాచలం పట్టణ శివారులోని రాజుపేట కాలనీ వద్ద శుక్రవారం ఉదయం ఆటోలో రేషన్​ బియ్యం తరలిస్తుండగా ఎన్​ఫోర్స్ మెంట్  టీమ్ పట్టుకుంది. దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వైపు ఆటోలో తరలిస్తున్న 9.80 క్వింటాళ్ల బియ్యాన్ని ఎన్​ఫోర్స్ మెంట్ డీటీ వెంకటేశ్వరరావు పట్టుకున్నారు. ఆటోతో పాటు బియ్యాన్ని సీజ్​ చేసి టౌన్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

అన్నపురెడ్డిపల్లిలో.. 

అన్నపురెడ్డిపల్లి: మండలకేంద్రంలో శుక్రవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ను ఎస్సై విజయ పట్టుకున్నారు. ట్రాక్టర్ ను తహసీల్దార్​ భద్రకాళికి అప్పగించగా, ట్రాక్టర్​ యజమాని రాందాస్ కు రూ.5 వేలు ఫైన్ వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: హైదరాబాద్​ నారాయణ కాలేజీలో ఫీజు కట్టలేదని, టీసీ ఇవ్వకపోవడంతో ఓ స్టూడెంట్​ పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకున్న ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్​ డిమాండ్​ చేశారు. మంత్రి రాజీనామా చేయాలని బీఎస్పీ ఆధ్వర్యంలో కొత్తగూడెం అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం ప్ల కార్డులతో నిరసన తెలిపారు. బీఎస్పీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్​ వీణ, నాయకులు నాగుల రవికుమార్, వీరునాయక్​, తాటిపాముల హరికృష్ణ, ధనుంజయ్​ పాల్గొన్నారు. 

పెళ్లిలో డీజే వివాదంలో ముగ్గురికి గాయాలు

మధిర (చింతకాని), వెలుగు: చింతకాని మండ‌‌‌‌‌‌‌‌‌‌లం మత్కేపల్లి నామ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌రంలో గురువారం రాత్రి  పెళ్లి వేడుకలో డీజే విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో ఉద్రిక్త ప‌‌‌‌‌‌‌‌రిస్థితులు నెల‌‌‌‌‌‌‌‌కొన్నాయి. ఇరువర్గాల వారు కత్తులు, కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిలో ఒక వర్గానికి చెందిన  ముగ్గురు వ్యక్తులకు క‌‌‌‌‌‌‌‌త్తిపోట్ల వల్ల తీవ్రగాయాలయ్యాయి. జల్లేపల్లి నాగేంద్రరావు, అతని భార్య,  కుమారుడికి తలకు, చేతికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి  పరిస్థితి విష‌‌‌‌‌‌‌‌మంగా ఉంది. ముగ్గురిని చికిత్స నిమిత్తం ఖ‌‌‌‌‌‌‌‌మ్మం ప్రభుత్వ ఆసుపత్రికి త‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌లించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కుటుంబాల మధ్య పాతకక్షలు ఉండడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

గంజాయి స్వాధీనం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: నగరంలోని కైకొండాయిగూడెం వెళ్లే దారిలో వాహనాల తనిఖీల్లో 3.5 కేజీల గంజాయి పట్టుబడిందని ఎక్సైజ్​ ఖమ్మం ఇన్స్​పెక్టర్​ కొత్తా రాజు తెలిపారు. కైకొండాయిగూడెంకు చెందిన నకిరికంటి హరిప్రసాద్​(ఆదాం), బాలాజీనగర్​కు చెందిన గోగుల గోపి బైక్​పై గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపినట్లు చెప్పారు. సీలేరు నుంచి గంజాయిని తీసుకొచ్చి 100 గ్రాముల పాకెట్లు చేసి ఇండస్ట్రియల్, బల్లేపల్లి ఏరియాల్లో అమ్ముతున్నట్లు తెలిపారు. ఎక్సైజ్​ ఆఫీసర్లు వి రవి, షేక్​రబ్బాని, శశికాంత్, నరేశ్, శివరాం, మారేశ్వరరావు తనఖీల్లో పాల్గొన్నారు.

ముంపు గ్రామాలుగా ప్రకటించాలి

బూర్గంపహాడ్, వెలుగు: మండలంలోని గోదావరి ప్రభావిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి పరిహారం అందించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ బస్టాండ్ సెంటర్ లో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామ పెద్దలు డా. చెన్నం సత్యనారాయణ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గోదావరి వరదలతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వాలు స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. సర్పంచ్ సిరిపురపు స్వప్న, చెన్నం సూర్యప్రసాద్, భూపల్లి నరసింహారావు, బట్టా విజయ్ గాంధీ, కేసుపాక వెంకట రమణ, డాక్టర్ విష్ణు, దాసరి సాంబ, చుక్కపల్లి బాలాజీ, బిజ్జం శ్రీనివాసరెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పూలపెల్లి సుధాకర్ రెడ్డి, మువ్వా వెంకటేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇదిలాఉంటే పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ ఎస్సీ కాలనీకి చెందిన యువకులు వార్డుల వారీగా సంతకాల సేకరణ ప్రారంభించారు. సర్పంచ్ సిరిపురపు స్వప్న మొదటి సంతకం చేశారు. ధర్మరాజు, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, తోకల రవిప్రసాద్, కేసుపాక రామకృష్ణ, తోకల రాము పాల్గొన్నారు.

మోడల్​ జీపీలుగా రూపొందించాలె

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో ఎంపిక చేసిన 78 గ్రామపంచాయతీలను మోడల్​ జీపీలుగా రూపొందించాలని కలెక్టర్​ అనుదీప్​ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు రైతువేదికలో వెరిఫికేషన్​ టీమ్​లకు శుక్రవారం ట్రైనింగ్​ ప్రోగ్రామ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఓడీఎఫ్​ ప్లస్​ పంచాయతీలుగా గుర్తించిన 78 జీపీల్లో ఈ నెల 22 నుంచి వెరిఫికేషన్​ టీమ్స్​ పర్యటిస్తాయని తెలిపారు. మరుగుదొడ్ల వినియోగం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, చెత్త సేకరణ తదితర అంశాలపై నివేదికలను అందించాలన్నారు. దీంతో లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. డీఆర్డీవో మధుసూదనరాజు, జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్, ఏపీడీ సుబ్రహ్మణ్యం, ఆర్డీవో స్వర్ణలత పాల్గొన్నారు.