టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్లు కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జే సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు (గురువారం) ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి చేతులమీదుగా రిలీజ్ చెయ్యనున్నారు.
కీడెంచి మేలు ఎంచమన్నారు పెద్దలు.. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు సినీ పెద్దలు. మొన్నటికి మొన్న సంధ్య ధియేటర్ దగ్గర పుష్ప 2 మూవీ సమయంలో జరిగిన తొక్కిసలాట సంగతి తెలిసిందే.. ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే సినీ పెద్దలు అప్రమత్తం అయ్యారు. రాంచరణ్ కొత్త మూవీ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను కొండాపూర్ లోని ABM మాల్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ వస్తే.. వాళ్లను కట్టడి చేయటం కోసం ముందస్తుగానే పోలీస్ బందోబస్తు తీసుకున్నారు నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం AMB మాల్ దగ్గర.. పదుల సంఖ్యలో పోలీస్ సిబ్బంది మోహరించారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేసందుకు ప్లాన్ చేశాడు. దీంతో మేకింగ్ విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా దాదాపుగా రూ.400 కోట్లు బడ్జెట్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించారు. ప్యాన్ ఇండియా భాషల్లో దాదాపుగా 12500 థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.