గుట్టుగా గంజాయి అమ్ముతుండగా ఇద్దరు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా : గంజాయి అక్రమ రవాణ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మల్ గూడ సమీపంలో చరణ్, నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం పోలీసులకు చెప్పారు. ఏపీలోని పాడేరు అటవీ ప్రాంతం నుండి 1700 గ్రాముల గంజాయిని తీసుకువచ్చి.. ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని, దీంతో ఇద్దర్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.