స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్ 15 పురష్కరించుకొని కేంద్ర హోంశాఖ బుధవారం ( August 14) గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ సర్వీసులో పని చేసే 1037 మంది అధికారులకు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అవార్డుల జాబితాను విడుదల చేసింది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పతకాలను ప్రకటిస్తుంది.
ఏపీ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 21 మంది పోలీసులకు దక్కిన పతకాల వివరాలు
- తెలంగాణకు చెందిన ఒకరికి ప్రెసిడెంట్ గ్యాలంటరీ పతకం, ఏడుగురికి పోలీస్ గ్యాలంటరీ, 11 మందికి పోలీస్ సేవా పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు లభించాయి
- రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం: తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ చందువు యాదయ్య
- తెలంగాణ నుంచి గ్యాలంటరీ మెడల్: ఐపిఎస్ అధికారి సునీల్ దత్, డిప్యూటీ అసాల్ట్ కమాండర్ మోర కుమార్, అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ షనిగరపు సంతోష్, జూనియర్ కమాండోలు అమిలి సురేష్, వేముల వంశీ, కాంపాటి ఉపేందర్, పాయం రమేష్‌లు ఎంపికయ్యారు.
- ఆంధ్రప్రదేశ్ నుంచి గ్యాలంటరీ మెడల్‌కు ఇన్ప్స్ స్టెక్టర్ షేక్ సర్దార్ ఘని, సబ్ ఇన్స్పెక్టర్ సవ్వన అరుణ్ కుమార్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మైలాపల్లి వెంటక రామ పరదేశీ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ రాజన గౌరీ శంకర్‌లు ఎంపికయ్యారు.
- ఏపీ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ విశిష్ఠ సేవా పతకం, నలుగురికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, 19 మందికి విశిష్ఠ సేవా పతకాలు
రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారానికి..
.
- ఆంధ్రప్రదేశ్ నుంచి... ఐజి మీసాల రవి ప్రకాష్, ఇన్స్పెక్టర్ దాసరి దండుగంగ రాజు ఎంపిక.
- తెలంగాణ నుంచి.... ఎడిజి సంజయ్ కుమర్ జైన్, డిప్యూటీ కమిషనర్ కటకం మురళీధర్‌లు ఎంపిక
ఉత్తమ ప్రతిభా పురస్కారాలకు...
- ఆంధ్రప్రదేశ్ నుంచి.... 16 మంది, తెలంగాణ నుంచి 11 మంది
- తెలంగాణ నుంచి లీడింగ్ ఫైర్‌మెన్‌లు తెలుగు మాధవరావు, మహ్మద్ వహీయుద్దీన్‌లు ఎంపిక.