భయమేస్తోందని మారాం చేసిన విద్యార్థి.. ధైర్యం చెప్పి పరీక్ష రాయించిన పోలీసులు.. ఆకట్టుకున్న దృశ్యం

భయమేస్తోందని మారాం చేసిన విద్యార్థి.. ధైర్యం చెప్పి పరీక్ష రాయించిన పోలీసులు.. ఆకట్టుకున్న దృశ్యం

‘‘నాకు భయం వేస్తోంది.. పరీక్షకు పోను’’  అని పరీక్షా కేంద్రం వద్ద మారాం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి, ధైర్యం చెప్పి పరీక్ష రాయించారు పోలీసులు. విద్యార్థికి మోటివేషన్ కలిగించి పరీక్ష కేంద్రంలోకి పంపించిన సంఘటన హన్మకొండలో జరిగింది.

 వివరాల్లోకి వేళితే.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6 నుంచి తొమ్మిదవ తరగతి ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 23) జరుగుతున్న అర్హత పరీక్షలకు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. 

అయితే హన్మకొండలో  ఓ సెంటర్ దగ్గర పరీక్ష రాసేందుకు భయపడుతూ లోపలికి వెళ్లనని మారాం చేస్తున్నాడు. పరీక్ష రాయాల్సింది తండ్రి ఎంతగా బతిమాలినా బాబు భయం వేస్తోందని సెంటర్ లోపలికి వెళ్లకుండా గేటు వద్దే ఆగిపోయాడు. అదే సమయంలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నిర్వర్తిస్తూ అటుగా వచ్చిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి బాబును గమనించారు. 

పరీక్షా కేంద్రంలోకి వెళ్లనని, భయం వేస్తోందని ఏడుస్తున్న బాలుడి దగ్గరకు వెళ్లి ఏసీపీ ధైర్యం చెప్పారు. ఏసీపీ దేవేందర్ రెడ్డితో పాటు కేయుసి ఇన్స్ స్పెక్టర్ రవికుమార్ లు బాబును బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా బాబు వినకపోవడంతో.. పరీక్ష రాస్తే సీటు వస్తుందని, బాగా చదువుకుంటే తమ లాగే పెద్ద ఆఫీసర్ కావచ్చునని మోటివేట్ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. 

విద్యార్థి చేత పరీక్ష  రాయించేందుకు పోలీసులు చూపిన చొరవ.. పరీక్షా కేంద్రం దగ్గర ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంది. పోలీసులు విద్యార్థిని ప్రోత్సహించిన తీరు గురించి చర్చించుకున్నారు.