రేపు సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ భాస్కర్ భద్రత బలగాలు హెలిప్యాడ్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా కొండగట్టుకు వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.
రేపు కేసీఆర్ కొండగట్టు షెడ్యూల్
ఉదయం 9గంటలకు ప్రగతిభవన్ నుంచి భవన్ నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.05 కి బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 9.10కి అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 9.40కి కొండగట్టు చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. ఒంటి గంటకు కొండగట్టు నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 1.30కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్తారు.