యాదాద్రి, వెలుగు : తప్పిపోయిన మూగ బాలుడిని పోలీసులు చైల్డ్ కేర్ ఇన్స్ట్యూషన్కు అప్పగించిన ఘటన యాదాద్రి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. డిస్ట్రిక్చైల్డ్ప్రొటెక్షన్ఆఫీసర్ సైదులు వివరాల ప్రకారం.. మాటలు రాని పదేండ్లు బాలుడు బీబీనగర్ మండలం పడమటి సోమారంలో తిరుగుతున్నాడు. గమనించిన స్థానికులు బాలుడిని పలకరించే ప్రయత్నం చేసినా స్పందన రాలేదు.
దీంతో పోలీసులకు సమాచారం అందించగా, బాలుడిని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు మాట్లాడించే ప్రయత్నం చేశారు. తెలుగు, హిందీలో మాట్లాడినా బాలుడి నుంచి రిప్లయ్రాలేదు. బాలుడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతోపాటు మాటలు రావని, వినికిడి లోపం ఉందని నిర్ధారణకు వచ్చారు.
దీంతో జిల్లా బాలల సంక్షేమ సమితికి బాలుడిని అప్పగించారు. వారు అతడిని బొమ్మలరామారంలోని చైల్డ్‌కేర్ ఇన్ స్టిట్యూషన్‌కు తరలించారు. బాలుడిని గుర్తించిన వారు 83282 98353కు నంబర్‌కు ఫోన్ చేయాలని డీసీపీవో సైదులు సూచించారు.