వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి నోటీసులు

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి నోటీసులు

కడప: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024, నవంబర్ 5 మంగళవారం రాత్రి కడప తాలూకా పోలీస్ స్టేషన్లో ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి తిరిగి పంపించేశారు. స్టేషన్ నుంచి బయటకు రాగానే రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. మీడియా పేరు చెప్పి అక్కడి నుంచి ఆయన జారుకున్నారు. 

అయితే, పోలీస్ స్టేషన్ నుండి బయటికెళ్లిన రవీంద్రారెడ్డి ఇంత వరకు ఇంటికి వెళ్లకపోవడంతో ఆయన ఎటు వెళ్లారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. వర్రా రవీంద్రారెడ్డి ని అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేని పోలీసులు ధృవీకరించారు. రవీంద్రారెడ్డి ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో వర్రా రవీంద్రారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి పోయినట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో కూటమి నేతలపై అభస్యకర, అసత్య పోస్టులు పెట్టాడన్న ఆరోపణలపై వర్రా రవీంద్రారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగానే రవీంద్రారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.