- ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సహా ఆరుగురు అరెస్టు
- హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఘటన
గచ్చిబౌలి, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ నడిబొడ్డున ఉన్న 12.09 ఎకరాల ప్రభుత్వ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ర్టేషన్ చేసుకోవడంతో పాటు ఓ నిర్మాణ సంస్థకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ అండ్ జీపీఏ చేయడం సంచలనంగా మారింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నెంబర్ 1, 4, 5, 20లో 12.09 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొన్నేండ్ల కింద తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ప్రమోషన్కార్పొరేషన్కు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం దశాబ్దాలుగా లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పొజిషన్ లోనే ఉంది. అయితే దీనిపై బోరబండకు చెందిన మహ్మద్ అబ్దుల్ రజాక్, అబ్దుల్అదీల్, సైదా కౌసర్, అఫ్సా సారా కన్నేశారు. 12.09 ఎకరాల ప్రభుత్వ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. రంగారెడ్డి జిల్లా సబ్రిజిస్ట్రార్కార్యాలయంలో ఇన్ చార్జ్ సబ్ రిజిస్ట్రార్ (సీనియర్ అసిస్టెంట్)గా పని చేస్తున్న గురు సాయిరాజ్ సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత గీక్ బిల్డర్ ఎల్ఎల్ పీ అనే కంపెనీతో డెవలప్ మెంట్ అగ్రిమెంట్ అండ్ జీపీఏ చేసుకున్నారు. ఆ స్థలంలో 39 అంతస్తుల్లో కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్బిల్డింగ్నిర్మాణం కోసం 30:70 భాగస్వామ్యంతో ఈ ఏడాది అక్టోబర్11న ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇట్ల బయటపడ్డది..
లెదర్ ఇండస్ట్రీస్కార్పొరేషన్ అధీనంలో ఉన్న స్థలంలోని 5.16 ఎకరాల్లో యూనిటీ మాల్నిర్మించేందుకు తెలంగాణ స్టేట్ట్రేడ్ప్రమోషన్కార్పొరేషన్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.202 కోట్లు కేటాయించింది. బిల్డింగ్ నిర్మాణానికి డిజైన్కూడా పూర్తయింది. భూమి చదును చేసే పనులను ఓఎన్సీ కన్స్ర్టక్షన్ కంపెనీకి కేటాయించారు. ఈ క్రమంలో నిందితులు అది తమ స్థలం అంటూ అడ్డుకున్నారు. దీంతో శేరిలింగంపల్లి ఎమ్మార్వో వెంకారెడ్డి సైబరాబాద్పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నకిలీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేసినట్టు గుర్తించారు. నిందితులు అబ్దుల్ రజాక్, అబ్దుల్అదీల్, సైదా కౌసర్, అఫ్సా సారాతో పాటు ఇన్ చార్జ్ సబ్ రిజిస్ట్రార్ గురు సాయిరాజ్, గీక్ బిల్డర్ కంపెనీ భాగస్వామి నవీన్ కుమార్ గోయల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.