సిగ్నల్స్ వద్ద బలవంతపు వసూళ్లు..ఫేక్ ట్రాన్స్​జెండర్ల అరెస్ట్

సిగ్నల్స్ వద్ద బలవంతపు వసూళ్లు..ఫేక్ ట్రాన్స్​జెండర్ల అరెస్ట్
  • వీరితోపాటు ముగ్గురు ట్రాన్స్​జెండర్లు కూడా..

సికింద్రాబాద్, వెలుగు: సిగ్నల్స్,హోటళ్లు, షాపుల వద్ద భిక్షాటన పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఫేక్ ట్రాన్స్​జెండర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ఉమ్మడి అనంతపూర్ ​జిల్లాకు చెందిన చాందిని అలియాస్ కుమార్ (45), సమీర అలియాస్​ఇషాక్(29), షేక్ ముంతాజ్ ఉరఫ్​బాషా (39), చిత్ర అలియాస్ సురేశ్ (35), మనీషా అలియాస్ మాల్తేష్ (25), జయశ్రీ అలియాస్ రమేశ్(29), షేక్ అషు అలియాస్​షఫీ(45) యాప్రాల్​ బాలాజీ నగర్​లో నివసిస్తున్నారు. 

వీరిలో సమీర, ముంతాజ్, చిత్ర లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకోగా, మిగిలిన నలుగురు ఆడవారిలా వేషాలు వేసుకొని భిక్షాటన చేస్తున్నారు. తిరుమలగిరి, కార్ఖానా ప్రాంతాల్లో సిగ్నల్స్ వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. హోటళ్లు, ఆఫీసులు, షాపులతోపాటు పాదచారుల నుంచి డబ్బులు గుంజుతూ.. ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 

దీనిపై సమాచారం అందుకున్న నార్త్​జోన్ టాస్క్​ఫోర్స్,  కార్ఖానా పోలీసులు వీరిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఎవరైనా బలవంత వసూళ్లకు పాల్పడితే డయల్100కు ఫిర్యాదు చేయాలని టాస్క్​ఫోర్స్​ డీసీపీ సుదీంద్ర సూచించారు.