330 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఆదివారం(జనవరి 7) అర్ధ రాత్రి 168 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఖాళీ టమాటా ట్రేల మధ్య గంజాయిని పెట్టి.. మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి 330 కేజీలు ఉంటుందని వెల్లడించారు.

నాగార్జున సాగర్, ఏపీ సరిహద్దులోని చెక్ పోస్ట్ దగ్గర స్మగ్లర్లను సాగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.