యువకులను వేలాడదీసి కొట్టిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేకలు దొంగతనం చేశారంటూ పశువుల కాపరి తేజ, దళిత యువకుడు కిరణ్‌ను వేలాడదీసి కొట్టిన కేసులో పోలీసులు ఆదివారం నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తమ అక్క కొడుకు కిరణ్ కనిపించడం లేదంటూ అతడి చిన్నమ్మ సరిత సెప్టెంబర్ 2న ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లెంట్ మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మేకల యజమాని రాములు, స్వరూప(దంపతులు), కుమారుడు శ్రీనివాస్, పనిమనిషి నరేష్‌లపై  అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కనిపించకుండా పోయిన కిరణ్ ఆచూకీ కనుగొనేందుకు 4 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.