చైన్ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్

ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 98 గ్రాముల బంగారం, మూడు వాహనాలతో పాటు మూడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

రాచకొండ కమిషనరేట్ లోని మాడ్గుల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాడ్గుల్, కనగల్ల, చింతపల్లి ఏరియాల్లో ఒంటిరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా నిందితుల నుంచి 98 గ్రాముల బంగారం, మూడు వాహనాలు, మూడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు  రమేశ్, రాజు, రవి, రాజులను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించామని చెప్పారు.