పాల్వంచ, వెలుగు: మెకానిక్ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పాల్వంచ పోలీసులు అరెస్ట్‌చేశారు. పాల్వంచలోని వనమా కాలనీకి చెందిన కొప్పుల వికాస్ కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్బైక్గతేడాది నవంబర్30న చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. డిసెంబర్ 6న పాల్వంచ నవభారత్ సెంటర్లో పోలీసులు తనిఖీ చేస్తుండగా, రేగళ్లకు చెందిన బింగి కమల్ రాయల్ఎన్ఫీల్డ్బైక్పై అటుగా వచ్చాడు.
తనిఖీ చేయగా, అది వికాస్బైక్అని తేలింది. సదరు బైక్‌ను తాను కొత్తగూడెం మండలం హేమచంద్రాపురంలోని బైక్మెకానిక్అరవింద్రెడ్డి వద్ద రూ.25వేలకు తీసుకున్నట్లు కమల్ తెలిపాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అరవింద్‌ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. బైకులు చోరీ చేసి, విక్రయిస్తున్నట్లు ఒప్పుకునాడు. అరవింద్ తోపాటు కమల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాము తెలిపారు.