నర్సింహులపేట మండలంలో ..గొర్రెల దొంగలు అరెస్టు

నర్సింహులపేట, వెలుగు : నర్సింహులపేట మండల కేంద్రంలో గొర్రెల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని పకిరా తండాకు చెందిన భూక్య హరికృష్ణ, గువులోత్ రమేశ్, గుగులోతు సుమన్, గుగులోతు కల్యాణ్ జల్సాలకు అలవాటు పడి, నర్సింహులపేట, మరిపెడ, తొర్రూర్​ మండలంలో ఇంటి ముందు కట్టేసిన గొర్రెలు, మేకలను దొంగతనం చేసేవారు.

వాటిలో కొన్ని తామే కోసుకుని, మిగితా వాటిని అమ్ముకునే వారు. ఈ క్రమంలో కొన్ని గొర్లను తొర్రూర్​ లోని అంగడిలో అమ్మేందుకు వెళ్తుండగా సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన మేకలు,గొర్రెల విలువ లక్ష50వేలు ఉంటుందని సీఐ సత్యనారాయణ, ఎస్సై సతీశ్​ చెప్పారు. నలుగురుని అరెస్టు చేసి ఆటో సీజ్ చేశామని తెలిపారు.