పీహెచ్​డీ విద్యార్థిని సూసైడ్ కేసులో ముగ్గురు అరెస్ట్

పీహెచ్​డీ విద్యార్థిని సూసైడ్ కేసులో ముగ్గురు అరెస్ట్
  •     పరారీలో మరో ఇద్దరు

సికింద్రాబాద్, వెలుగు : పీహెచ్​డీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నాచారం సరస్వతి కాలనీకి చెందిన దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీలో పీహెచ్​డీ చేస్తూ ప్రాజెక్ట్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్నది. ఆమె తండ్రి సంగీతరావు ఐఐసీటీలోనే పనిచేసి పదవీ విరమణ చేశారు. అతడికి డీజీపీ ఆఫీస్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న బెల్లా అనిల్​కుమార్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే అనిల్ భార్య కు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని అతడి ​నుంచి రూ.15లక్షలు తీసుకున్నాడు.

ఎంతకు ఉద్యోగం ఇప్పించకపోవడంతో తీసుకున్న డబ్బుల కోసం దీప్తిపై  అనిల్ కుటుంబం ఒత్తిడి చేసింది. తన తండ్రి తీసుకున్న డబ్బులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమతో ఉండడం లేదని చెప్పినా వినకుండా వేధించారు.  దీంతో ఆమె సెల్పీ వీడియో తీసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ కే సులో  అనిత, ఆమె తండ్రి సోమయ్యతోపాటు సంగీతరావును శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్​ తరలించారు. కానిస్టేబుల్​అనిల్​కుమార్, అతని సోదరుడు సైదయ్య పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నారు.