ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం.. మైనర్ బాలికపై లైంగిక దాడి

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం..   మైనర్ బాలికపై లైంగిక దాడి

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడకు చెందిన ఓ బాలికకు,అఘాపూరాకు చెందిన షేక్ అర్బాజ్ కు ఇన్ స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. బాలికను నమ్మించి కర్ణాటక గుల్బర్గాకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు అర్బాజ్. బాలిక ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోలీసులు అర్భాజ్ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో.. అర్భాజ్ బాలికను హైదరాబాద్ కు పంపించి పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్ కు తరలించి వాంగ్మూలం రికార్డ్ చేశారు.నాంపల్లి రైల్వే స్టేషన్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.