లక్షకే డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్.. హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్ ముఠా అరెస్ట్

లక్షకే  డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్.. హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్ ముఠా అరెస్ట్

హైదరాబాద్  ఫిలింనగర్ లో ఫేక్ సర్టిఫికెట్ ముఠాను పోలీసులు  పట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు యూనివర్శిటీల పేరుతో  ఫేక్  సర్టిఫికెట్స్ తయారు చేసి అమ్ముతున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు ,యువతను టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. లక్ష నుంచి లక్షన్నర వరకు  డిగ్రీ, డిప్లొమా,పీజీ ,ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్ ను డెలివరీ చేస్తున్నారు.   తెలంగాణ, ఆంధ్రా, అన్న యూనివర్సిటీ చెన్నై పేరు మీద ఫెక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తుంది ఈ గ్యాంగ్.  ఫేక్ సర్టిఫికెట్స్ తో కొందరు విదేశాలకు సైతం  వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.

హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17న  సాయంత్రం వజహత్ అలీ ఫెక్ సర్టిఫికెట్ తో దొరికాడు.  రాజిఉల్లా ఖాన్, హాబీబ్ ఇద్దరు ఉన్నట్లు వజహత్ అలీ మొదట చెప్పాడు. మిగతా గ్యాంగ్ కూడా ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది.  ఫిబ్రవరి 18న   పరేడ్ గ్రౌండ్ దగ్గర గ్యాంగ్ సభ్యులు అందరూ వచ్చినట్లు సమాచారం వచ్చింది.  వాళ్ల దగ్గర ఉన్న ఫేక్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నాం.  పోలీసులు నిఘా ఉందని సిటీ వదిలి పారిపోవడానికి  గ్యాంగ్ ప్లాన్ చేసింది..అందుకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర్లో  కలిశారు. వజహత్ అలీ నిజామాబాద్ వాసి. హాబీబ్  అబ్రాడ్ కన్సల్టెన్సీ  రన్ చేస్తున్నాడు.  గతంలో  హాబీబ్ పై  నాలుగు నకిలీ సర్టిఫికెట్స్ కేసులు నమోదయ్యాయి.  ఎజెంట్స్, సబ్ ఎజెంట్స్ ద్వారా ఈ ఫేక్ సర్టిఫికెట్స్ దందా నిర్వహిస్తున్నారు. జాబ్ లేకుండా ఉన్న వారు, మ్యారేజ్ కానీ వాళ్లను టార్గెట్ గా ఈ సర్టిఫికెట్స్ దందా చేస్తున్నారు. ఆరుగురు సభ్యుల ముఠా డిగ్రీ, ఇంజనీరింగ్ ,డిప్లొమా ఫేక్ సర్టిఫికెట్స్ ను  తయారు చేస్తుంది. 

ఒక్కో సర్టిఫికెట్ ను  లక్షన్నర నుంచి ఎక్కువ కూడా  పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ల దగ్గర 114 సర్టిఫికెట్స్ దొరికాయి.  సునీల్ కపూర్, రాహుల్ తివారి యూపీ నుంచి ఈ సర్టిఫికెట్స్ తయారు చేసి పంపిస్తున్నారు.  కొరియర్ ద్వారా సరిఫికెట్స్ డెలివరి చేస్తున్నారు. 4 లాప్ టాప్స్, ప్రింటర్, రాయల్ ఎన్ ఫిల్డ్ బైక్, విసిటింగ్ కార్డ్స్ , మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాం.  మొబైల్ ఫోన్స్ పరిశీలిస్తున్నాం.  ఇంకా దర్యాప్తు జరుగుతుంది, ఎజెంట్స్,  యూపీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటాము. ఇలాంటి షార్ట్ కట్ పద్దతిలో సర్టిఫికెట్స్ తీసుకోవద్దని కోరుతున్నాం అని డీసీపీ తెలిపారు.