చాక్ పౌడర్, గంజితో ట్యాబ్లెట్లు తయారు : హైదరాబాద్లో ఊహించని మాఫియా

హైదరాబాద్‌లో నకిలీ మందులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చాక్ పౌడర్, గంజితో మెడిసిన్స్ తయారు చేస్తున్నారనే.. పక్కా సమాచారంతో 2024 మార్చి 5వ తేదీన మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగ్‌లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మందుల విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.33 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ నకిలీ మెడిసిన్స్ తయారు చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ALSO READ :- మాల్దీవులు ఎంతకు తెగించింది: చైనాతో సైనిక ఒప్పందం

ఫేక్ ప్రకనటలు చూసి మోసపోవద్దని తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు సూచించారు. టీవీల్లో, సెల్‌ఫోన్లలో ప్రకటనలు చూసి ఈ మధ్య టాబ్లెట్స్ కొనుగోలు చేయడం అందరికి అలవాటుగా అయిపోయిందని గుర్తుచేశారు. వీటిలో చాలా పెద్ద మోసం దాగుందని అనుమానాలు వ్యక్తం చేశారు. సిటీలో గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లోనే మందులను కొనుగోలు చేయాలని తెలిపారు. నకిలీ మెడిసిన్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు.