జల్సాలకు అలవాటు పడి.. చైన్ ​స్నాచింగ్​లు

మెట్ పల్లి, వెలుగు: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణానికి చెందిన చంద్రగిరి పద్మాకర్ అలియాస్  బన్నీ(18) ఓ ఐరన్ హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్​షాపులో పని చేస్తున్నాడు. తన్నీరు శ్రీకాంత్ (19) ఇంటర్​చదువుతున్నాడు. వీరిద్దరూ కలిసి చోరీలు చేసి వచ్చే డబ్బుతో జల్సాలు చేసేవారు. ఈక్రమంలో ఈనెల 3న రాత్రి పట్టణంలోని కలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బైక్‌‌‌‌‌‌‌‌పై వచ్చి నడిచి వెళ్తున్న వృద్ధురాలి మెడలో పుస్తెలు తాడు తెంచుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం పట్టణ శివారులోని వట్టివాగు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. బన్నీ, శ్రీకాంత్​కొట్టేసిన బంగారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి పద్మాకర్ 16 చోరీ కేసుల్లో నిందితుడు. వీరివద్ద 25 గ్రాముల బంగారంతోపాటు బైకు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.