భూములు చదును చేసేందుకు వెళ్తున్న రైతుల అడ్డగింత 

భూములు చదును చేసేందుకు వెళ్తున్న రైతుల అడ్డగింత 

శివ్వంపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం లక్ష్మాపూర్​ లో కస్టోడియన్ భూములు చదును చేసేందుకు వెళ్తున్న రైతులను పోలీసులు గురువారం అడ్డుకున్నారు. పది రోజులుగా లక్ష్మాపూర్ శివారులోని కస్టోడియన్ భూములను చదును చేసి సాగుచేసుకునేందుకు శివ్వంపేట మండలంలోని వివిధ గ్రామాల రైతులు వెళ్తున్నారు. ఈక్రమంలో పోలీసులు మండల పరిధిలోని చిన్నగొట్టిముక్కుల గ్రామ పరిధి చాకరిమెట్ల దగ్గర పోలీసులు ఆయా గ్రామాల నుంచి వస్తున్న రైతులను కొందరిని అదుపులోకి తీసుకొని గుమ్మడిదల పీఎస్‌కు తరలించారు. అనంతరం వీరందరినీ వదిలేశారు. మరికొంతమందిని అక్కడి నుంచే వెనక్కి పంపారు.