బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్ షీట్ లో తెలిపారు. MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపర్చారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వివరించారు. రేవ్ పార్టీ నిర్వహకులుగా 9 మందిని చార్జిషీట్ లో పేర్కొన్నారు పోలీసులు.
ఈ కేసులో ఇప్పటికే నటి హేమ బెంగళూరు పరప్ప అగ్రహార జైలులో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. తర్వాత బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఆమె సభ్యత్వాన్ని మా రద్దు చేసింది. ఆగస్టులో హేమపై మా విధించిన బ్యాన్ ఎత్తివేసింది.
Also Read:-ఇండియాలో పెరుగుతున్న జీసీసీలు
మే 19న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రైడ్ లో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి కూడా బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ కేసులో A2అరుణ్ కుమార్, A4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసులు.