లేడీ డాన్‌‌‌‌‌‌‌‌ రియల్టర్​పై పోలీసుల ఫోకస్

లేడీ డాన్‌‌‌‌‌‌‌‌ రియల్టర్​పై పోలీసుల ఫోకస్
  • గుర్రం విజయలక్ష్మిపై బాచుపల్లి, దుండిగల్ పీఎస్‌‌‌‌‌‌‌‌లో మూడు కేసులు
  •  గ్రామ పంచాయతీ తప్పుడు అనుమతులతో 200 విల్లాలు
  • అండగా నిలిచిన ఓ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి
  • హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న లేడీ డాన్‌‌‌‌‌‌‌‌ రియల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్రం విజయలక్ష్మిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. బాచుపల్లి, దుండిగల్ పీఎస్‌‌‌‌‌‌‌‌లలో ఆమెపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయలక్ష్మి అక్రమాలకు అండగా ఓ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఉన్నట్లు గుర్తించారు.

 వీరితో పాటు ప్రభుత్వ అధికారుల పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు. విజయలక్ష్మి భర్త  ప్రముఖ ఫార్మా కంపెనీ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌గా విదేశాల్లో ఉండగా, ఆమె పదేండ్లుగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారం చేస్తోంది.

అధికారుల హోదాను బట్టి చెల్లింపులు

మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్‌‌‌‌‌‌‌‌, మల్లంపేట్‌‌‌‌‌‌‌‌లో విల్లాలు నిర్మించింది. 2020లో బాచుపల్లి పీఎస్  పరిధిలోని బంధం కుంటలో సీతారామ్ హోమ్స్‌‌‌‌‌‌‌‌ పేరుతో 45 విల్లాలు నిర్మించింది. ఇందులో 8 విల్లాలను ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌లో కట్టి అమ్మడంతో అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కూల్చివేశారు. ఇందుకు సంబంధించి ఆమెపై కేసులు నమోదయ్యాయి. అనంతరం దుండిగల్‌‌‌‌‌‌‌‌ మల్లంపేట్‌‌‌‌‌‌‌‌లో లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో  విల్లాలను చేపట్టింది.  

ఇందులో 60 విల్లాలను హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ అనుమతులు తీసుకోగా, 200 విల్లాలను గ్రామ పంచాయతీ తప్పుడు అనుమతులతో నిర్మించింది. ఇందుకోసం హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ అధికారులతో పాటు రాజకీయ ప్రముఖుల సహకారం తీసుకుంది. అనుమతుల కోసం ఆయా అధికారుల హోదాను బట్టి చెల్లించినట్లు తెలిసింది. 

అలాగే దుండిగల్ కత్వా చెరువు ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌, బఫర్ జోన్‌‌‌‌‌‌‌‌లో అక్రమ నిర్మాణాలు చేయగా, వాటిని హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి విల్లాలను కొనుగోలు చేసిన బాధితులు ఆమెపై దుండిగల్‌‌‌‌‌‌‌‌, బాచుపల్లి పోలీస్ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదులు చేశారు.