హోంగార్డ్ రవీందర్ మృతి నేపథ్యంలో హోంగార్డులకు పోలీస్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. హోంగార్డులు అందరూ తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలని ఆదేశించారు పోలీస్ ఉన్నతాధికారులు. డ్యూటీ లేని హోంగార్డులు కూడా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ లోనే ఉండాలని హుకుం జారీచేశారు. హోంగార్డులు అందరూ అందుబాటులో ఉండేలా ఇన్స్ పెక్టర్లు చూసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్ లో పని చేసే వారు సమ్మె చేస్తే డిస్మిస్ అవుతారని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన హోంగార్డ్ రవిందర్ ను చూసేందుకు వెళ్లి ఆందోళనలు చేస్తారనే ఉద్దేశ్యంతో అధికారులు ఈ ఆదేశాలు జారీచేసినట్లుగా చెబుతున్నారు.
ALSO READ : మాజీ బాయ్ఫ్రెండ్ను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రతిక
జీతాల ఆలస్యం, పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డ్ రవీందర్ మృతి చెందారు. డీఆర్ డీవో అపోలోలో చికిత్స పొందుతూ 2023 సెప్టెంబర్ 08 శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రవీందర్ చనిపోయినట్లుగా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు రవీందర్.