సంధ్య థియేటర్ FIRలో పుష్ప నిర్మాతలు : ఏ18గా కేసు నమోదు

సంధ్య థియేటర్ FIRలో పుష్ప నిర్మాతలు : ఏ18గా కేసు నమోదు

సంధ్య థియేటర్ ఘటన రిమాండ్ రిపోర్టు బయటకొచ్చింది. ఈ కేసులో  అల్లు అర్జున్ ను  ఏ11 గా చేర్చిన పోలీసులు.. ఏ 18గా పుష్ఫ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతను చేర్చారు. ఏ1 నుంచి   ఏ8 వరకు థియేటర్ యజమానులు, మేనజర్ ను చేర్చారు. ఏ9 ,ఏ 10 గా  సంధ్య థియేటర్  సెక్యూరిటీ, మేనేజర్ ను చేర్చారు. ఏ 11 నుంచి ఏ 17 వరకు అల్లు అర్జున్, బౌన్సర్, సెక్యూరిటీ పేర్లను చేర్చారు. ఏ 18గా మైత్రీమూవీస్ ను చేర్చారు.

Also Read :- సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటా

 నిందితుల లిస్ట్ 

A1 అగమాటి పెదరామిరెడ్డి.. థియేటర్ ఓనర్
A2 అగమాటి చిన్నరామిరెడ్డి.. థియేటర్ ఓనర్
A3 ఎం.సందీప్, పార్ట్‌నర్‌
A4 సుమిత్‌, పార్ట్‌నర్‌
A5 అగమాటి వినయ్, పార్టనర్
A6 అశుతోశ్‌రెడ్డి, పార్ట్‌నర్‌
A7 రేణుకాదేవి, పార్టనర్
A8 అరుణారెడ్డి, పార్ట్‌నర్
A9 నాగరాజు, మేనేజర్
A10 విజయ్‌చందర్, లోయర్ బాల్కానీ ఇన్‌చార్జ్‌
A11 అల్లు అర్జున్, పుష్ప హీరో
A12 సంతోశ్, అల్లు అర్జున్ పీఏ
A13 శరత్‌బన్నీ, అల్లు అర్జున్ మేనేజర్
A14 రమేశ్‌, సెక్యూరిటీ టీమ్
A15 రాజు, సెక్యూరిటీ టీమ్
A16 వినయ్ కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్
A17 ఫర్వేజ్‌, బాడీగార్జ్
A18 మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్స్...

డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో  సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా..ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే..ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు  నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మళ్లీ నోటీసులు ఇచ్చిన పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ 24 చిక్కడపల్లి పీఎస్ లో విచారించారు.