గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసుల హై సెక్యూరిటీ

గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా నగరంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు.

ముఖ్యంగా మసీదులు, దేవాలయాల వద్ద ప్రత్యేకంగా బలగాలను మోహరింపజేశారు. సెప్టెంబర్ 18వ తేదీన గణేష్ చతుర్థి ప్రారంభం కాగా.. 28వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉండనుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ALSO READ : రజినీ మనవడిగా చేసిన ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సోషల్ మీడియా స్టార్

ఈ ఏడాది గణేష్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ తేదీలు ఒకేరోజు రావడంతో హైదరాబాద్‌లో భారీగా బలగాలను మోహరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. 

సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడం నిషేధమని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గతంలో ప్రకటించారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు సజావుగా సాగేందుకు పౌరులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అక్టోబర్ 1న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు నిర్వహించాలని మర్కజీ మిలాద్ జూలూస్ కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.