8 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ సీజ్ ..తయారీ కేంద్రం నిర్వాహకుడు అరెస్ట్​

8 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ సీజ్ ..తయారీ కేంద్రం నిర్వాహకుడు అరెస్ట్​

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్  లంగర్​హౌస్​లో భారీ మొత్తంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీకి చెందిన ఇమ్రాన్  సలీం కొన్నేండ్లుగా ‘హెన్నా గార్లిక్’ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ తయారు చేస్తూ హైదరాబాద్​లోని పలు హోటళ్లు, కిరాణా షాపులకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న లంగర్ హౌస్, టాస్క్​ఫోర్స్  పోలీసులు గురువారం రాత్రి ఇమ్రాన్​ సలీం తయారీ కేంద్రంపై దాడి చేశారు.

సిట్రిక్​ యాసిడ్,  కుళ్లిన అల్లం, వెల్లుల్లితో తయారు చేసిన 825 కిలోల పేస్ట్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ రూ.4.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా.. ఇమ్రాన్​ సలీం గతంలో ఇలాగే  పలుమార్లు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్  తయారుచేసి పోలీసులకు చిక్కాడు. జైలుకు వెళ్లొచ్చినా అతని తీరు మారలేదు.