డబ్బులు, విలువైన వస్తువుల కోసం హత్యలు

డబ్బులు, విలువైన వస్తువుల కోసం హత్యలు

మెదక్, వెలుగు : మెదక్‌‌‌‌ జిల్లా చిన్నశంకరంపేటలో గత నెల 22, ఈ నెల 3న జరిగిన హత్యల మిస్టరీని పోలీసులు చేధించారు. డబ్బులు, విలువైన వస్తువుల కోసం ఇద్దరిని ఒకే వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మెదక్‌‌‌‌ ఎస్పీ ఉదయ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఒట్టెం మల్లేశం అలియాస్‌‌‌‌ గొల్ల మల్లేశ్ డబ్బుల కోసం పలు నేరాలకు పాల్పడేవాడు. సెప్టెంబర్‌‌‌‌ 10న హైదరాబాద్‌‌‌‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌‌‌‌లో రైలు ఎక్కి.. నిద్రపోతున్న వ్యక్తి నుంచి ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, ఫోన్‌‌‌‌ చోరీ చేసి వాటిని తన అన్న ఒట్టెం రమేశ్‌‌‌‌కు ఇచ్చాడు. 

ఆ తర్వాత అక్టోబర్‌‌‌‌ 31న కాచిగూడలోనే రైల్లో ఓ వ్యక్తిని సుత్తితో కొట్టి అతడి వద్ద నుంచి మొబైల్‌‌‌‌, గోల్డ్‌‌‌‌ చైన్‌‌‌‌, రింగ్, సిల్వర్‌‌‌‌ బ్రాస్‌‌‌‌లెట్‌‌‌‌ దోచుకున్నాడు. 2013లో చిన్నశంకరంపేట పీఎస్‌‌‌‌లో నమోదైన ఓ హత్య కేసులో మల్లేశానికి పదేండ్లు జైలు శిక్ష పడగా 2017లో విడుదల అయ్యాడు. తర్వాత చర్లపల్లి సెంట్రల్‌‌‌‌ జైల్‌‌‌‌లో జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ను వేధించిన కేసులో మల్లేశంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మరోసారి జైలుకు పంపారు. జైలుకు పంపాడని జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌పై కక్ష పెంచుకున్న మల్లేశం 2019లో కీసర పీఎస్‌‌‌‌ పరిధిలోని నేతాజీనగర్‌‌‌‌లో అతడి ఇంటికి వెళ్లి వాషింగ్‌‌‌‌ మెషీన్‌‌‌‌, మెయిన్‌‌‌‌ డోర్‌‌‌‌ను తగులబెట్టాడు. 

దీంతో మల్లేశంను మరోసారి అరెస్ట్‌‌‌‌ చేసి జైలుకు పంపారు. 2022లో జైలు నుంచి విడుదలైన తర్వాత కాచిగూడ, నిజామాబాద్‌‌‌‌ రైళ్లలో తిరుగుతూ చోరీలు చేయడంతో పాటు, ఒంటరిగా ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో అక్టోబర్‌‌‌‌ 22న నిజామాబాద్‌‌‌‌ పట్టణంలోని లేబర్​అడ్డా వద్ద ఉన్న కామారెడ్డి జిల్లా పోసానిపేటకు చెందిన నవీన్‌‌‌‌ (24)ను పరిచయం చేసుకొని చిన్నశంకరంపేట మండల పరిధిలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌‌‌‌కు తీసుకొచ్చాడు. అక్కడ నవీన్‌‌‌‌కు మద్యం తాగించి చిన్నశంకరంపేటలోని పీహెచ్‌‌‌‌సీ వెనుక వైపు తీసుకెళ్లి బండరాయితో కొట్టి చంపిన తర్వాత డెడ్‌‌‌‌బాడీని కాల్చివేశాడు. 

అలాగే ఈ నెల 3న ఇందల్‌‌‌‌వాయి రైల్వేస్టేషన్‌‌‌‌ వద్ద ఉన్న నిజామాబాద్‌‌‌‌ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లికి చెందిన కొమ్రె స్వామి (39)ని పరిచయం చేసుకుని అతన్ని కూడా రైల్లో మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌‌‌‌కు తీసుకొచ్చాడు. అక్కడ మద్యం తాగించిన అనంతరం సమీపంలోని పద్మరాయినిగుట్ట వద్ద ఉన్న బస్‌‌‌‌షెల్టర్‌‌‌‌కు తీసుకెళ్లి హత్య చేసిన తర్వాత బాడీని కాల్చి వేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌ చేశారు. ఈ క్రమంలో మంగళవారం చిన్నశంకరంపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లేశంను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యల విషయం బయటపడింది. అతడితో పాటు అతడి అన్న రమేశ్‌‌‌‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి గోల్డ్‌‌‌‌ రింగ్‌‌‌‌, గోల్డ్‌‌‌‌ చైన్‌‌‌‌, ఐదు మొబైల్స్‌‌‌‌, ఒక ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, ఒక సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులిద్దరిని రిమాండ్‌‌‌‌కు తరలించిన ఎస్పీ తెలిపారు.