ఎమర్జెన్సీ అయితే తప్ప.. ప్రజలు బయటకు రావొద్దు

మరిపెడ , వెలుగు :  మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారులో ఉన్న ఆకేరువాగు వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ శశాంక్,ఎస్పీ శరత్ చంద్ర పవార్  పరిశీలించారు. అత్యవసరం అయితే తప్పా..  ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.  పోలీసులు, అధికారులు అలెర్ట్​గా ఉండాలని, ప్రజలను ప్రమాద స్థలాలకు వెళ్లనీయొద్దని  చెప్పారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలె.. 

కాశీబుగ్గ(కార్పొరేషన్​) :  ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కోసం  గ్రేటర్​ వరంగల్​ మున్సిపాల్​ కార్పొరేషన్​లో  హెల్ప్​ లైన్​ సెంటర్​ను ఏర్పాటు చేశామని  మేయర్​ గుండు సుధారాణి తెలిపారు.    టోల్ ఫ్రీ నెంబర్ 18004251980, వాట్సాప్​ నెంబర్​  7997100300ను  సంప్రదించాలని చెప్పారు. 

ALSO READ :రాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్రు: సండ్ర వెంకట వీరయ్య