కామారెడ్డి టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కామారెడ్డిలో మంగళవారం పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక పోలీసు ఆఫీసర్లు, సిబ్బందితో పాటు, కేంద్ర బలగాలు ఇందులో పాల్గొన్నాయి.
రైల్వే స్టేషన్ నుంచి సిరిసిల్లా రోడ్డు, జేపీఎన్రోడ్డు, సుభాష్రోడ్డు, పెద్దబజార్, నిజాంసాగర్ ఛౌరస్తా, కొత్త బస్టాండ్, అశోక్ నగర్కాలనీ, రైల్వే గేటు, పాతబస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు కవాతు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ ప్రకాశ్, టౌన్ సీఐ నరేశ్, ఎస్బీ సీఐ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.