బీజేపీ అభ్యర్థి ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా

నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఇంటి దగ్గర పోలీసుల హై డ్రామా కొనసాగింది. నవంబర్ 13వ తేదీన ఉదయం సూర్యనారాయణ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కంఠేశ్వర్ ఆలయానికి వెళ్లడానికి అనుమతి లేదని..సూర్యనారాయణ ఇంటికి నోటీసులు అతికించారు పోలీసులు. దీంతో ఏం జరుగుతుందోనని అంతా ఆందోళనకు గురయ్యారు.

గత 4 రోజులుగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణలు ఒకరిపై ఒకరు భూ కబ్జా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంతో ఇవాళ ఎమ్మెల్యే బిగాల గణేష్ తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ధన్ పాల్. 

అందులో భాగంగానే కంఠేశ్వర్ ఆలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాని కంఠేశ్వర్ ఆలయానికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు పోలీసులు. అందుకు సంబంధించిన నోటీసులను ధన్ పాల్ సూర్యనారాయణ ఇంటికి అతికించారు పోలీసులు.