బైకులు తగలబెట్టిన దుండగులు.. కేసు నమోదు

గుర్తు తెలియని వ్యక్తులు బైకులకు నిప్పుపెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని బాంబే కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదు బైకులు.. ఒక కారును తగలబెట్టారు దుండగులు. కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసివున్న బైకులను రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి నిప్పంటించారు. అక్కడే ఉన్న ఓ కారును సైతం తగలబెట్టి వెళ్లిపోయారు దుండగులు. 

దీంతో బైకులు పూర్తిగా కాలిపోగా, కారు పాక్షికంగా దగ్దమైంది. బాధితులు పోలీసులకు పిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన వాహనాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.