కాల్వలో కారును గుర్తించిన పోలీసులు

జగిత్యాల జిల్లా కాకతీయ కాల్వలో పడిన తవేరా కారును పోలీసులు గుర్తించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. కారులో ఉన్న రేవంత్, ప్రసాద్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం మెట్ పల్లి మండలం వెల్లుల్ల శివారులో కారు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టి కాకతీయ కాల్వలోకి దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి మెట్ పల్లి నుంచి వెల్లుల్ల వైపు కారు వెళ్లినట్లు సీసీ దృశ్యాలను పోలీసులు గుర్తించారు. కారులో గుండవేని ప్రసాద్, పూదరి రేవంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కాల్వలో నీరు ప్రవహిస్తుండటంతో కారును గుర్తించడంలో ఆలస్యమవుతుందని పోలీసులు తెలిపారు.  దాంతో అధికారులు కాకతీయ కాల్వలో నీటిని ఆపేసి కారు కోసం వెతికారు. బుధవారం ఉదయం కారు బయటపడటంతో క్రేన్ సహాయంతో బయటికి తీశారు.