ట్రాఫిక్ ​రూల్స్ ​బ్రేక్.. రూ.12.24 కోట్ల ఫైన్

ట్రాఫిక్ ​రూల్స్ ​బ్రేక్.. రూ.12.24 కోట్ల ఫైన్
  • రామగుండం కమిషనరేట్​లో 5.05 లక్షల ఈ- చాలన్స్​
  • 12,779 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.76 లక్షల ఫైన్
  • 141 గ్యాంబ్లింగ్ కేసుల్లో మరో రూ.77 లక్షలు సీజ్
  • 208 మందిపై హిస్టరీ షీట్స్, 140 అట్రాసిటీ కేసులు 
  • ఈ- పెట్టీ కేసులు లక్షన్నర పైనే..

మంచిర్యాల, వెలుగు: ట్రాఫిక్ రూల్స్​ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు భారీగా ఫైన్లు వేశారు. హెల్మెట్ ధరించకపోవడం, నంబర్​ప్లేట్ లేకపోవడం, స్పీడ్, ర్యాష్, ట్రిపుల్​ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్​ రూట్, రాంగ్​ పార్కింగ్, ట్రాఫిక్​ఉల్లంఘనలపై​ గట్టిగానే వడ్డించారు. గతేడాది కాలంలో రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో 5,05,636 ఈ చాలన్స్​​ జారీ చేసి రూ.12కోట్ల 24 లక్షలు వసూలు చేశారు. 

మంచిర్యాల జిల్లాలో 2,15,927 కేసుల్లో రూ.5 కోట్ల 22వేలు జరిమానా విధించగా, పెద్దపల్లి జిల్లాలో 2,89,709 కేసులు నమోదు చేసి రూ.7కోట్ల 23 లక్షల 76 వేల ఫైన్లు వేశారు. 2024లో కమిషనరేట్​పరిధిలో నమోదైన వివిధ కేసుల వివరాలను పోలీస్​కమిషనర్​ ఎం.శ్రీనివాస్ సోమవారం మీడియాకు రిలీజ్ ​చేశారు.

భారీగా డ్రంక్ అండ్ ​డ్రైవ్ ​కేసులు

యాక్సిడెంట్లు చాలావరకు మద్యం మత్తులో జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు.. వాటిని కంట్రోల్​చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కమిషనరేట్​ పరిధిలో నిత్యం డ్రంక్​ అండ్ ​డ్రైవ్​తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్​వరకు మొత్తం 12,779 డ్రంక్​ అండ్ ​డ్రైవ్​కేసులు నమోదయ్యాయంటే మందుబాబులు ఎంతగా తాగి రోడ్ల మీదికి వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుల్లో కోర్టులు 5,469 మందికి రూ.76.99  లక్షల జరిమానా విధించాయి. మిగిలిన వారికి రెండు నుంచి వారం రోజులు పాటు హాస్పిటల్​ క్లీనింగ్, బస్టాండ్​క్లీనింగ్​వంటి పనిష్​మెంట్లు ఇచ్చాయి. మంచిర్యాల జిల్లాలో 6,054 కేసుల్లో రూ.32.84 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో 6,725 కేసుల్లో రూ.44.14  లక్షల ఫైన్లు వేశారు.

Also Read :- 365 బీ నేషనల్​హైవే అలైన్​మెంట్​ మార్పు ఉన్నట్టా లేనట్టా?

208 మందిపై హిస్టరీ షీట్స్

తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 208 మందిపై ఈ ఏడాది పోలీసులు హిస్టరీ షీట్స్​ఓపెన్ చేశారు. ఇందులో 50 మందిపై రౌడీ షీట్స్, 158 మందిపై సస్పెక్ట్​ షీట్స్ తెరిచారు. మంచిర్యాలలో 33 మందిపై రౌడీ షీట్స్, 108 మందిపై సస్పెక్ట్​షీట్స్ ఓపెన్​ చేశారు. పెద్దపల్లి జిల్లాలో 17 మందిపై రౌడీషీట్స్, 50 మందిపై సస్పెక్ట్​ షీట్స్ ఓపెన్​ చేశారు. రౌడీషీటర్లకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ​నిర్వహించి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

140 అట్రాసిటీ కేసులు..

కమిషనరేట్​పరిధిలో ఈ ఏడాది 140 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవగా.. వాటిలో మంచిర్యాల జిల్లాలో 83, పెద్దపల్లిలో 57 కేసులున్నాయి. ఎఫ్ఐఆర్​ నమోదు చేసిన వెంటనే 29 కేసుల్లో బాధితులకు రూ.24.52 లక్షలు, 15 కేసుల్లో చార్జిషీట్​ తర్వాత రూ.12.75  లక్షల ఎక్స్​గ్రేషియా అందజేశారు. ఈ పెట్టీ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 78,386, పెద్దపల్లిలో 70,627, మొత్తం లక్షా 49 వేల కేసులు నమోదు చేశారు. 

విచ్చలవిడిగా గ్యాంబ్లింగ్ 

జిల్లాలో గ్యాంబ్లింగ్​ విచ్చలవిడిగా సాగుతోంది. ఈ ఏడాది వ్యవధిలో పోలీసులు141 కేసుల్లో 928 మందిపై కేసులు పెట్టి రూ.77.25  లక్షల నగదు సీజ్ ​చేశారు. మంచిర్యాలలో 85 కేసుల్లో 561 మందిపై కేసులు నమోదు చేసి రూ.28.30  లక్షలు, పెద్దపల్లి జిల్లాలో 56 కేసుల్లో 367 మందిపై నమోదు చేసి రూ.49 లక్షలు సీజ్​ చేశారు.

ఎక్సైజ్ ​కేసుల్లో రూ.20.71  లక్షలు, ఇసుక అక్రమ రవాణా కేసుల్లో రూ.17.78 లక్షలు, లిక్కర్​ కేసుల్లో రూ.5.70 లక్షలు సీజ్​ చేశారు. అలాగే 88 గంజాయి కేసుల్లో 237 మంది నుంచి 51.23 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. 130 పీడీఎస్ ​రైస్​ కేసుల్లో 3,302 క్వింటాళ్ల రైస్​సీజ్​ చేశారు. జిల్లాలో 12 నకిలీ విత్తనాల కేసుల్లో 23 మందిపై కేసు పెట్టి రూ.46 లక్షల విలువైన విత్తనాలు​స్వాధీనం చేసుకున్నారు. లోక్​అదాలత్​లో 42,762 కేసులను పరిష్కరించారు.