హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హ్యాండ్సమ్ హంక్ రానా కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక బుధవారం జరగనుంది. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో రేపు ఈ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా.. ఈవెంట్ దృష్ట్యా బుధవారం మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వైపు వెహికిల్స్ కు అనుమతి ఉండదని నిర్వాహకులు తెలిపారు. సవేరా ఫంక్షన్ హాల్, కృష్ణకాంత్-పార్క్, కల్యాణ్ నగర్, సత్యసాయి నిగామగమం, కృష్టానగర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు. జూబ్లీహల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగామగమం వైపు మళ్లించనున్నారు. 21వ తేదితో ఇచ్చిన పాసులకు అనుమతి లేదని నిర్వాహకులు చెప్పారు. 23వ తేదీ పాసులు ఉన్న వారినే అనుమతిస్తామని పేర్కొన్నారు.
For More News..