మావోయిస్టుల బంద్​ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు

ములుగు, వెలుగు : మావోయిస్టు బంద్​ నేపథ్యంలో ములుగు మండలంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్సైలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, లక్ష్మారెడ్డి వాహన తనిఖీలు నిర్వహించడంతోపాటు ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి అపరిచితులు వస్తే తమకు తెలియజేయాలన్నారు. మండలంలోని మల్లంపల్లి, జంగాలపల్లి, రాయినిగూడెం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రైవేటు వాహనాలను సోదాలు చేశారు. మావోయిస్టులకు ఎవరూ సహకరించొద్దని, ఎవరైనా తెలియని వ్యక్తులు వస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.