- చర్యలు ప్రారంభించిన పోలీసులు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇటీవల కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో మునిగి ఐదుగురు యువకులు చనిపోవడంతో భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అంతగిరి ప్రాజెక్టు, కోమటి చెరువు, పాండవుల చెరువు, ఎల్లమ్మ చెరువుతో పాటు ఇతర పెద్ద చెరువుల వద్ద పెట్రోలింగ్ తో పాటు ప్రమాదాల హెచ్చరికలపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయని, సరదా కోసం ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్త వహించాలని సీపీ అనురాధ సూచిచారు. పండుగ దినాలు, ప్రాజెక్టుల సందర్శనకు వచ్చేవారు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్లవద్దని సూచించారు.