పట్నం నరేందర్​రెడ్డిని విచారించిన పోలీసులు

పట్నం నరేందర్​రెడ్డిని విచారించిన పోలీసులు
  • వికారాబాద్ బొంరాస్​పేట స్టేషన్​లో విచారణ

కొడంగల్, వెలుగు : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గురువారం బొంరాస్ పేట పోలీసులు విచారించారు. దుద్యాల మండలం రోటిబండా తండా సంఘటనకు సంబంధించి ఎస్ హెచ్ వో రావుఫ్ పలు విషయాలపై ఆరా తీశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ఈ విచారణ కొనసాగింది.