
- పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీల ప్రచారం
- నిబంధనలను అతిక్రమిస్తున్నారని పోలీసుల అభ్యంతరం
- ఏఎస్పీ చైతన్యరెడ్డి రావడంతో సద్దుమణిగిన గొడవ
భిక్కనూరు, వెలుగు : మండల కేంద్రంలోని బాలుర పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద గురువారం కాంగ్రెస్, బీజేపీలు టెంట్లు వేసుకుని ప్రచారం చేశాయి. ఎన్నికల నిబంధనల ప్రచారం గుంపులుగా ఉండి ప్రచారం చేయవద్దని ఎస్సై ఆంజనేయులు, సీఐ సంపత్‌కుమార్‌లు ఇరు పార్టీల లీడర్లకు తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు టెంట్ తొలగిస్తే మేము తొలగిస్తామని బీజేపీ నాయకులు మొండికేశారు.
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్నారంటూ ఇరుపార్టీలవారితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటిపోతుందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డికి ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న ఏఎస్పీ కాంగ్రెస్, బీజీపీ లీడర్లతో మాట్లాడి అక్కడ నుంచి పంపించారు. అనంతరం ఆమె పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించి, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎస్సై, సీఐలకు సూచించారు.