బీఆర్ఎస్ గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు పోలీసులను వాడుకుంది

బీఆర్ఎస్  గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు పోలీసులను వాడుకుంది

ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును విచారిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలు కీలక అంశాలను దర్యాప్తు బృందం రాబడుతుంది. టాస్క్ ఫోర్స్, SOT పోలీసులను గత బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో డబ్బు రవాణాకు వాడుకున్నట్లు గుర్తించింది దర్యాప్తు బృందం. ప్రముఖ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించారని విచారణలో తేలింది. 

భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన ఆధారాలతో కొంతమంది రాజకీయ నాయకులను దర్యాప్తు బృందం విచారించనుంది. విచారణలో భాగంగా న్యాయ సలహాలను తీసుకుంటుంది. తిరుపతన్న, భుజంగరావు వాడిన కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అధికారులు. 2024 ఏప్రిల్ 1న సోమవారం నాంపల్లి కోర్టులో రాధా కిషన్ రావును వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ.. పిటిషన్ వేయనున్నారు పోలీసులు.