మేడ్చల్ మిస్టరీ మర్డర్... మహిళ ఎవరో తెలిసింది

మేడ్చల్ మిస్టరీ మర్డర్... మహిళ ఎవరో తెలిసింది

మేడ్చల్ జిల్లాలో జనవరి 25న జరిగిన మహిళ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. హత్యకు గురైన మహిళ నిజామాబాద్  బోధన్ గ్రామానికి చెందిన మహిళ  శివానందగా గుర్తించారు.  బతుకుదెరువు కోసం హైదరాబాద్ కి వచ్చిన మహిళ... ఇళ్లలో పనిచేస్తూ  మరో వ్యక్తితో  నివసిస్తుందని  పోలీసు తెలిపారు.  మహిళ కుటుంబంతోపాటు అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Also Read :- అప్పు కోసం బ్యాంక్ సిబ్బంది అరాచకం

మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‎లో జనవరి 25న ఈ ఘటన జరిగింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బండరాళ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. యువతిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు నిందితులు. యువతి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  మేడ్చల్ జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు ఆరా తీసి మృతురాలు నిజామాబాద్ కు చెందిన మహిళగా గుర్తించారు. ఎవరు ఎందుకు చంపారనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.