హైదరాబాద్ లో త్వరలో ప్రైవేట్ పోలీసులు

హైదరాబాద్ లో త్వరలో ప్రైవేట్ పోలీసులు
  • పోలీస్ తరహాలో ప్రైవేట్  సెక్యూరిటీ గార్డుల నియామకం

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్  సిటీలో ప్రజల రక్షణ కోసం పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. పోలీస్​తరహాలో ప్రైవేట్​ సెక్యూరిటీ గార్డు  వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రగ్స్‌‌, మహిళల భద్రత, సైబర్​ సెక్యూరిటీ, ట్రాఫిక్‌‌  మానిటరింగ్‌‌, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌, కమర్షియల్  కాంప్లెక్స్‌‌ల వద్ద భద్రత కోసం‌‌ ఆ గార్డులను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌  సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌‌సీఎస్‌‌సీ) ఆధ్వర్యంలో శుక్రవారం ‘నేషనల్‌‌  ఫిజికల్  సెక్యూరిటీ సమ్మిట్‌‌ 2024’ పేరుతో సదస్సు నిర్వహించనున్నారు.

బంజారా హిల్స్‌‌లోని కమాండ్ అండ్ కంట్రోల్  సెంటర్‌‌‌‌లో జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌‌ ‌‌బాబు సహా ప్రైవేట్‌‌  సెక్యూరిటీ ఏజెన్సీల నిర్వాహకులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన లోగోను సిటీ సీపీ, హెచ్‌‌సీఎస్‌‌సీ చైర్మన్‌‌  కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గ్లోబల్  సిటీగా మారుతున్న హైదరాబాద్‌‌లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న సెక్యూరిటీ అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.