హైదరాబాద్లో గణనాథుల నిమజ్జనానికి.. 35 వేల మందితో బందోబస్తు

  •  బాలాపూర్ నుంచి హుస్సేన్​సాగర్​ వరకు 21 కి.మీ మేర సాగనున్న శోభాయాత్ర
  •  3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు.. సీసీ కెమెరాలతో నిఘా
  •  ఏర్పాట్లను పర్యవేక్షించిన ముగ్గురు సీపీలు 
  •  రేపు ఉదయం 6 గంటల నుంచి వైన్స్ బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు తీసుకున్నారు. బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు మొత్తం 21 కి.మీ మేర శోభాయాత్ర సాగనుంది. శోభాయాత్ర జరిగే ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టారు. శోభాయాత్రను పూర్తిగా సీసీటీవీ కెమెరాలో నిఘా నీడలోకి తెచ్చారు.

గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,బార్లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూసివేయాలనిఆదేశాలు జారీ చేశారు. శోభాయాత్ర, నిమజ్జనాలను బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కమాండ్ అండ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు. 

ట్యాంక్​బండ్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ..

 సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం బందోబస్తును పర్యవేక్షించారు. బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ వరకు శోభాయాత్ర  రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను పరిశీలించారు. అడిషనల్ సీపీ సుధీర్ బాబు, జాయింట్ సీపీలు, డీసీపీలతో కలిసి బస్సులో ప్రయాణించారు. శాలిబండ నుంచి మదీనా వరకు పోలీస్ సిబ్బందితో కలిసి కాలినడకన రూట్​ను పరిశీలించారు. చార్మినార్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు వివరాలను తెలుసుకున్నారు.  

Also Read : పింఛన్ల కోసం దివ్యాంగుల గోస... మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు
 

25 వేల694 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 125 ప్లాటూన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిద్దం చేశారు. శోభాయాత్ర జరిగే రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్టీ పోలీసులను మోహరించనున్నారు. చార్మినార్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మక్కా మసీదు సహా ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

కమాండ్ సెంటర్​లోని స్క్రీన్లకు 5 డ్రోన్లు అటాచ్​ 

శోభాయాత్ర, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 5 డ్రోన్లను ఆపరేట్ చేయనున్నారు. డ్రోన్ ద్వారా కమాండ్ కంట్రోల్​ సెంటర్​లోని మెగా స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్థానికంగా ఉన్న పరిస్థితులను గమనిస్తుంటారు. ఎలాంటి ఘటనలు జరిగినా స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే పోలీసులకు సమాచారం అందిస్తారు. హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్, ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. మహిళలకు ఇబ్బంది ఎదురుకాకుండా షీ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు.

శోభాయాత్ర పొడవునా రోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ, టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్, ట్రాఫిక్ పోలీసులు, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులను మోహరించనున్నారు. శోభాయాత్రలో ఇతర 
వెహికల్స్​ను అనుమతించరు. 5 జోన్ల డీసీపీలు స్పెషల్ వ్యూ సెంటర్లు, టీఎస్ కాప్ యాప్​లో గణేశ్​నిమజ్జనం సెక్యూరిటీని పరిశీలించనున్నారు.

రాచకొండ, సైబరాబాద్​లో..

సరూర్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినీట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిమజ్జనం జరిగే చెరువులు, పాండ్స్ వద్ద మొత్తం 7 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 228 ప్రాంతాల్లో పికెట్ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్, నేరెడ్ మెంట్, ఎల్ బీనగర్​లో ప్రత్యేక కంట్రోల్ రూమ్​పెట్టారు. నిమజ్జనం జరిగే  ప్రాంతాల్లో 3,600 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. వీటిని బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేరేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లతో కనెక్ట్ చేశారు.

సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో కూడా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర గణేశ్​ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లను సమీక్షించారు. మొత్తం 6 వేలకు  పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.దుర్గం చెరువు సహా గణనాథుల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టారు. 

కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తాం

బంజారాహిల్స్​లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​లోని మెగా స్క్రీన్​పై శోభాయాత్రను పరిశీలిస్తాం. శోభాయాత్రలో పాల్గొనే మండపాల నిర్వాహకులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 35 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నాం.

ఓల్డ్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాలు, హుస్సేన్​ సాగర్ ఏరియాను మా ఆధీనంలోకి తీసుకున్నాం. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టాం. శోభాయాత్రలో అత్యవసర పరిస్థితి ఎదురైతే డయల్ 100కు లేదా బందోబస్తులో ఉన్న పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి  

–  సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్

56 ప్రాంతాల్లో  నిమజ్జనానికి ఏర్పాట్లు

 రాచకొండ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గణపతి లడ్డూ వేలం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం. వేలం పూర్తి అయిన తర్వాతశోభాయాత్ర ప్రారంభమవుతుంది. చాంద్రాయణగుట్ట వద్ద సిటీ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి శోభాయాత్ర ప్రవేశిస్తుంది.

రాచకొండ పరిధిలో 11 వేలకు పైగా గణనాథుల మండపాలను ఏర్పాటు చేశారు. వాటి నిమజ్జనం కోసం సరూర్​నగర్ మినీ ట్యాంక్​బండ్ సహా 56 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. లిక్కర్ అమ్మకాలపై శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు నిషేధం విధించాం. 

– డీఎస్ చౌహాన్, సీపీ, రాచకొండ