ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి.. వరంగల్ డాక్టర్ హత్యాయత్నం కేసులో ట్విస్ట్

 ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి.. వరంగల్ డాక్టర్ హత్యాయత్నం కేసులో ట్విస్ట్

వరంగల్ లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన లో కీలక పురోగతి సాధించారు పోలీసులు. విచారణలో నువ్వెరపోయే ట్విస్ట్ బయటపడింది. సొంత భార్యే డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయించింది ఆయన భార్య ఫ్లోరా మరియా. ఫిబ్రవరి 20 న రాత్రి బట్టుపల్లి బైపాస్ లో డాక్టర్ పై  ఎటాక్ జరిగింది. అయితే తన ప్రియుడు జిమ్ ట్రైనర్ తో ఫ్లోరా మరియా వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. ఇందులో కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడికి సుపారి ఇచ్చి భర్తను హత్య చేయాలని భార్య ప్లోరా మరియా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మర్డర్ ప్లాన్ కి AR కానిస్టేబుల్ రాజు సహకరించాడు. 

సంగారెడ్డిలో ఉన్న సమయం లో జిమ్ ట్రైనర్ సామ్యూల్ తో ఫ్లోరా మరియా వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలియడంతో భార్య ఫ్లోరాని మందలించాడు డాక్టర్ సుమంత్ రెడ్డి. భర్తను హత్య చేస్తే ఇద్దరు కలిసి ఉండవచ్చని ప్లాన్ చేసుకున్నారు ఫ్లోరా మరియా , సామ్యూల్. మొదట యాక్సిడెంట్ చేసి చంపాలని ప్లాన్ చేశారు... ఐతే అది విఫలమవడంతో ప్లాన్ బీ అమలు చేశారు నిందితులు.  బట్టుపల్లి బైపాస్ రోడ్డు పై కారును అడ్డగించి నడిరోడ్డుపై సుమంత్ పై ఐరన్ రాడ్లతో దాడి చేశారు దుండగులు. ప్రస్తుతం సుమంత్ చావు బతుకుల్లో ఉన్నాడు. 

ఫిబ్రవరి 20న  వరంగల్ జిల్లాలోని భట్టుపల్లి దగ్గర కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ గాదె సుమంత్ రెడ్డిని గుర్తుతెలియని  వ్యక్తులు  ఇనుపరాడ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.చనిపోయాడానికును దుండగులు పారిపోయారు. తీవ్ర గాయాలైన డాక్టర్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.