వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..

రోడ్డు మీద వెళ్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులకు మధ్యప్రదేశ్‌ పోలీసులు అక్కడే శిక్ష విధించారు. ఈ ఘటన దేవాస్‌లో శనివారం జరిగింది. రోడ్డు మీదుగా వెళ్తున్న మహిళలపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఇద్దరు ఆకతాయిలకు పోలీసులు అక్కడే శిక్ష విధించారు. ఆకతాయిల చేత రోడ్డు మీద గుంజీలు తీయించారు.

‘రోడ్డు మీద వెళ్తున్న మహిళలను ఈ ఇద్దరు వ్యక్తులు పిలిచి వేధిస్తున్నారు. ఇలాంటి వారికి భయపడి మహిళలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మహిళల పట్ల ఇటువంటి ప్రవర్తన సహించబోమని చెప్పడానికి ఉదాహరణగా మేం దీన్ని చేయాల్సి వచ్చింది. ఆకతాయిలను బహిరంగంగా శిక్షిస్తూ.. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాం’ అని లేడీ కానిస్టేబుల్ మనీషా అన్నారు.

గత నెల అక్టోబర్ 18న బంగంగా ప్రాంతంలో కూడా ఓ ఇద్దరు వ్యక్తులు మహిళా పోలీసులపై దాడి చేశారు. వారిని అరెస్టు చేసి బహిరంగంగా సిట్-అప్స్ తీయించారు.

For More News..

జీహెచ్ఎంసీ సిత్రాలు.. ఒకే ఇంటి నెంబర్‌పై 152 ఓట్లు

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి