జగిత్యాల జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం

జగిత్యాల జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం

చిరు వ్యాపారాలే లక్ష్యంగా మోసం 

జగిత్యాల/కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల, కథలాపూర్, మెట్‌‌‌‌పల్లి ప్రాంతాల్లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. ఇటీవల రొట్టెలు అమ్మే ఓ మహిళకు గుర్తు తెలియని వ్యక్తి నకిలీ రూ. 500 నోటు ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పండ్లు, రొట్టెలు, కూరగాయలు అమ్మే వారినే లక్ష్యంగా చేసుకొని నకిలీ నోట్లు అంటగడుతున్నట్లు తెలుస్తోంది.

 గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంలో నలుగురైదురికి పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 500 చిల్లర కావాలంటూ వచ్చి చిల్లర తీసుకొని నకిలీ నోటు అంటగడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఒక్క నకిలీ నోటు కోసం ఫిర్యాదు చేయలేక బాధితులు సైలెంట్‌‌‌‌గా ఉండిపోతున్నారు.