
కరీంనగర్, వెలుగు: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా కరీంగనగర్ కమిషనరేట్ పోలీసుల చేసిన మాక్‌డ్రిల్ పలువురిని ఆకట్టుకుంది. డాగ్, బాంబ్ స్క్వాడ్, యాక్షన్ టీం కమాండోలు పలు క్రైం సన్నివేశాలను కళ్లకు కట్టేలా చూపించారు. కిడ్నాప్ అయిన వ్యక్తిని షార్ప్ షూటర్స్, కమాండోలు కాపాడడడం, బాంబ్ స్క్వాడ్ బాంబును నిర్వీర్యం చేయడం, కత్తి వాసనను పసిగట్టి డాగ్ స్క్వాడ్ నిందితుడిని గుర్తించడం వంటి అంశాలను ప్రద్శించారు. ముఖ్యంగా పోలీస్ డాగ్స్ టైసన్, రాంబో మంటలంటుకున్న రింగులో నుంచి దూకడం, పోలీస్ ఆఫీసర్‌కు సెల్యూట్ చేయడం ఆకట్టుకుంది.